రైతులను ఆదుకోవాలని కలెక్టరుకు వినతి

ప్రజాశక్తి-దర్శి: మిచౌంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. గురువారం ఆమె కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందిం చారు. దర్శి నియోజకవర్గంతో పాటు జిల్లాలో తుపాను వల్ల నష్టపోయిన మిరప, కంది, పొగాకు, వరి పంటలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు.

➡️