రైతులను ఆదుకోవాలి

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : సాగర్‌ నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 2 టిఎంసిల నీటిని విడుదల చేసి, పాజెక్టు పరిధిలో సాగు చేసిన పంటలకు ఒక్కతడి నీరందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, వైసిపి సంత నూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేరుగ నాగార్జునకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు, కౌలు రైతు నాయకులు మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు దెబ్బతినడంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీరంతా సముద్రం పాలైనట్లు తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌లో 60వేల ఎకరాలకు, రబీలో 80 వేల ఎకరాలు సాగునీరు, 43 గ్రామాలకు తాగునీరు అందించేందులా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇటీవల కాలరంలో రెండు విడతలుగా గేట్లు కొట్టుకుపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలిపారు. ప్రస్తుతం 20 వేల ఎకరాల్లో మిర్చి, పొగాకు, వరి తదితర పంటలు చేసినట్లు తెలిపారు. ఏకరానికి లక్షలాది రూపాయల మేర పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. నవంబరు, డిసెంబరులో పడిన వర్షాలకు కుంటలు చెరువుల్లోకి చేరిన నీటిని రైతులు ఇప్పటి వరకూ పంటలకు వినియోగించుకున్నట్లు తెలిపారు.ప్రస్తుతం నీటి తడి అవసరం ఉందన్నారు. ఒక్కతడి నీరు అందిస్తే రైతులు పెట్టిన పెట్టుబడులు చేతికి వస్తాయన్నారు. లేకుంటే ఒక్క రూపాయ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌ నుంచి 2టిఎంసిల నీటిని గుండ్లకమ్మకు విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. దీంతో స్పందించిన మంత్రి నాగార్జున మాట్లాడుతూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహదారుడు విజయసాయి రెడ్డితో మాట్లాడి సాగర్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు ఈకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జె. జయంతిబాబు, పమిడి వెంకట్రావు, కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె. మాబు, రైతు సంఘం మండల అధ్యక్షుడు వెంకట్రావు, యోనా తదితరులు పాల్గొన్నారు.

➡️