రైతుల సమస్యలను పట్టించుకోని జగన్‌

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా తుపాను వస్తుందని ముందుగా తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేదు. నేనొస్తున్నానని తెలిసి చిరిగిపోయిన సంచులు ఇచ్చారు. తన పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇవాళ బయటకొచ్చారని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్‌ తీరును తప్పుబట్టారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని అమతలూరులో మిచౌంగ్‌ తుపాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను చంద్రబాబు నాయుడు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుపానుతో పంట నష్టపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. వేమూరు నియోజక వర్గంలో 90 వేల ఎకరాల్లో పంట సాగుచేస్తే 90 శాతం పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. ఎకరాకు రూ.50 వేల వంతున రైతులు ఖర్చు చేశారని తెలిపారు. రేపల్లెలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేస్తే 60 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు తెలిపారు. బాపట్లలో 45 వేల ఎకరాలు సాగు చేస్తే 45 వేల ఎకరాల్లో పంట దెబ్బతిందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతున్నారు. పంటలు దెబ్బతిని రైతులు కోలుకునే పరిస్థితి లేదన్నారు. టిడిపి హయాంలో ఎప్పటికప్పుడు పంట కాలువల్లో పూడికలు తీసినట్లు తెలిపారు. నేడు ఎక్కడైనా పంట కాలువల్లో పూడిక తీశారా? డ్రెయిన్స్‌ శుభ్రం చేశారా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ రెడ్డికి బంగాళ దుంపలకు, ఉల్లిగడ్డలకు తేడా తెలియదని విమర్శించారు. పొటాటో అంటే ఏమిటని రైతులను అడుగుతున్నారన్నాని, ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. వైసిపి మంత్రులు సాధికార యాత్ర పేరిట తిరుగుతున్నారన్నారు. వారి మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప చేతలు గడప కూడా దాటం లేదన్నారు. టిడిపి హయాంలో వరికి నష్టపరిహారంగా రెండురన్న ఎకరాలకు రూ.20 వేలిస్తే నేడు రూ.15 వేలకు తగ్గించినట్లు తెలిపారు. జగన్‌ రెడ్డి బాధితులకు 25 కేజీల బియ్యం ఇచ్చామంటున్నారని తెలిపారు. 25 కేజీల బియ్యంతో రైతుల జీవితాలు బాగుపడతాయా అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో నేత కార్మికులు, మత్స్య కార్మికులకు 50 కేజీల బియ్యం, ఖర్చులకు రూ. 5 వేలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రూ 2,500 ఇస్తారంటా అని తెలిపారు. వైసిపి ప్రభుత్వం పేదలను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేస్తోంది. రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష ్టపోయారన్నారు. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మరో 3 నెలల్లో టిడిపి ప్రభుత్వం వస్తుందని, నష్టపోయిన రైతులందరినీ ఆదు కుంటామని తెలిపారు. ప్రజల్లో చైతన్యం రావాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఆలస్యంగా చంద్రబాబు పర్యటనతుపాను కారణంగా పంటనష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు అత్యధిక సంఖ్యలో రావడంతో పర్యటన ఆలస్యంగా సాగింది. వేమూరు నియోజకవర్గంలో పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు టిడిపి నేత నక్కా ఆనంద్‌బాబు, జనసేన నాయకులు స్వాగతం పలికారు. – కూచిపూడిలో పంటలు పరిశీలించి రైతులతో చంద్రబాబు మాట్లాడారు. – అమర్తలూరు మండలం కూచిపూడి, పెడపూడి, అమర్తలూరు, గోవాడ గ్రామాలలోని పంట పొలాలును పరిశీలించారు.- చెరుకుపల్లి, నగరం మండలాల్లో పర్యటన పూర్తి చేసుకుని బాపట్ల నియోజకవర్గంలో పంటపొలాల సందర్శనకు సాయంత్రం 4.30 గంటలకు రావలసిన చంద్రబాబు రాత్రి 10 గంటలకు కూడా రాలేకపోయారు.- రాత్రికి బాపట్లలో బస చేసి శనివారం ఉదయం పర్చూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కార్యకర్తలకు చంద్రబాబు అభివాదంప్రజాశక్తి- చెరుకుపల్లి తుపాను బాధితులను పరామర్శించేందుకు బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు చెరుకుపల్లి ఐలాండ్‌ సెంటర్‌లో ఆగి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం తూర్పుపాలెం, పుడివాడ అడ్డరోడ్డు వద్ద వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించి, రైతులను అడిగి నష్టం వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా రైతుల తరఫున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఎమ్మెల్యే అనగానీ సత్యప్రసాద్‌, టిడిపి నాయకులు మల్లాది రామకష్ణ, డివి.రాంబాబు, పి. కుమారస్వామి ,సనకా శ్రీనివాసరావు,ఎంఆర్‌కె. మూర్తి, వుపాల సాంబశివరావు పాల్గొన్నారు.

➡️