రైతుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : రైతుల భూ సమస్యలు పరిష ్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం మండల కార్యదర్శి మారం రెడ్డి రత్నారెడ్డి తెలిపారు. స్థానిక నారాయణ స్వామి కాంప్లెక్స్‌లో రైతు సంఘం మండల కమిటీ సమావేశం ఎం. ముసలయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నారెడ్డి మాట్లాడుతూ రైతులు భూముల సమస్యలపై తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. అయి నప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రకృతి అనుకూలించక పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిం చడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందన్నారు. వెంటనే నష్టపరిహారం అందజేసి రైతులను ఆదు కోవాలన్నారు. అనంతరం తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో షేక్‌ అజీద్‌ బాషా, పామూరి నారాయణ, పోర్ల లక్ష్మయ్య, గుడిపాటి నారాయణ, ఎస్‌.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

➡️