రైతు, కార్మిక సంఘాల ధర్నా

Feb 26,2024 21:35

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : దేశంలో కార్మిక, కర్షకుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)తో కేంద్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద రైతు సంఘాల సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల ఆధ్వర్యాన ధర్నా చేశారు. డబ్ల్యుటిఒ సమావేశాన్ని బహిష్కరించాలని, రైతుల ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని, పంటలకు మద్దతు ధరల చట్టం, రుణ మాఫీచట్టం చేయాలని, కార్మిక హక్కుల హరించే కార్మిక కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, ఉపాధ్యక్షులు లోకవరపు అదినారాయణ మూర్తి, సిఐటియు నాయకులు యుఎస్‌ రవికుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, సిఐటియు నాయకులు యుఎస్‌ రవికుమార్‌, బి. రమణ, ఎర్రి నాయుడు , పట్టణ పౌర సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, రైతు సంఘం నాయకులు గెద్ద లక్ష్మి, జొన్నాడ ఉప సర్పంచ్‌ అప్పలనాయుడు, బంగారునాయుడు, రవిరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️