రైల్వే లైన్‌కు భూములను అప్పగించాలి

ప్రజాశక్తి-గుంటూరు : విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైనుకు సంబంధించి జిల్లా పరిధిలో సేకరించిన భూముల్లో పెండింగ్‌లో ఉన్న స్థలాలను వెంటనే రైల్వే శాఖకు అప్పగించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు తన ఛాంబర్‌లో గురువారం రైల్వే శాఖాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయవాడ-గూడురు మూడవ రైల్వేలైనుకు సంబంధించి మంగళగిరి, పొన్నూరు మండలాల పరిధిలో పెండింగ్‌లో స్థలాలను వెంటనే రైల్వే శాఖకు అప్పగించాలని తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లా పరిధిలో రైల్వే లైనుకు సేకరించిన స్థలాలకు రైల్వే శాఖ అధికారులను సమన్వయం చేసుకొని సర్వే చేసి మార్కింగ్‌ వేయాలన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, ఆర్వీఎన్‌ఎల్‌ డీప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సుధీర్‌బాబు, అసిస్టెంట్‌ మేనేజరు మోహన్‌, కలెక్టరేట్‌ జి సెక్షన్‌ డీటీ కాశీరత్నం పాల్గొన్నారు.

➡️