లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ

పింఛన్లు పంపిణీ చేస్తున్న మంత్రి అమర్‌నాథ్‌, ఎంపీ సత్యవతి తదితరులు

ప్రజాశక్తి- పెందుర్తి

వైసిపి ప్రభుత్వ పాలనలోనే అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దకే నేరుగా పింఛను అందుతోందని స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద రూ.మూడు వేలకు పెంచిన పింఛనను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అందజేశారు.కార్యక్రమంలో ఎంపిపి మధుపాడ నాగమణి, జెడ్‌పిటిసిి ఉప్పల దేవి, ఆర్‌డిఒ హుస్సేన్‌, సర్పంచ్‌ గొరపల్లి శ్రీను, వైసిపి నేత కనకరాజు, ఎంపిటిసి అప్పలరాజు పాల్గొన్నారు.తగరపువలస : భీమిలి మండలం, పెద నాగమయ్యపాలెం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పంపిణీ చేశారు. సర్పంచ్‌ బొడ్డు సత్తమ్మ అధ్యక్షతన జరిగిన సభలో జెడ్‌పిటిసి గాడు వెంకటప్పడు, ఎంపిటిసి తోట అరుణ, ఎఎంసి చైర్మన్‌ యలమంచిలి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌ శరగడం రఘునాధరెడ్డి, వైసిపి నాయకులు బొడ్డు దుర్గారావు, చిల్ల హరి, ఇఒపిఆర్‌డి అప్పలరాజు పాల్గొన్నారు.నక్కపల్లి : అవ్వా తాతలకు ఇచ్చిన హామీను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిలబెట్టుకుని రూ.3000 పింఛన్‌ నగదును అందించారని రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ అన్నారు. మండలంలో ఉపమాక పంచాయతీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నం, జడ్పిటిసి సభ్యురాలు కాసులమ్మ, సర్పంచ్‌ ప్రగడ వీరబాబు, వైస్‌ ఎంపీపీ ఈశ్వరరావు ,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కొప్పిశెట్టి హరిబాబు, కొల్లాటి బుజ్జి, మనబాల తాతారావు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .నర్సీపట్నం టౌన్‌ : ఎన్నికలలో ఇచ్చిన హామీలను 98 శాతం నెరవేర్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ అన్నారు. మండల ప్రజా పరిషత్తు సమావేశ మందిరంలో పెన్షన్‌ కానుకను ఎమ్మెల్యే అందజేశారు. ఈఎంపీపీ సుర్ల రాజేశ్వరి, సుర్ల చంద్రశేఖర్‌, మండల పార్టీ అధ్యక్షులు ఎస్‌వివి సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ ఇన్నం రత్నం రమణ ఎంపీడీవో జయమాధవి, సర్పంచ్‌లు గొంప కన్నయ్య నాయుడు, వెంకటరత్నం, వేములపూడి పిఎసిఎస్‌ అధ్యక్షులు గాడి మురళీకృష్ణ, వేములపూడి ఎంపీటీసీ వెంకటేష్‌ పాల్గొన్నారు. కోటవురట్ల : పాములవాకలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, రామచంద్రపాలెం గ్రామంలో ఎంపీటీసీ సభ్యులు రాంబాబు, స్థానిక సర్పంచ్‌ పరదేశమ్మ పింఛన్ల పంపిణీ చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షులు లాలం మహేష్‌, వైసిపి సీనియర్‌ నాయకులు కన్నబాబు పాల్గొన్నారు.గొలుగొండ : సిఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సిహెచ్‌.నాగాపురం సర్పంచ్‌ యలమంచిలి రఘురామచంద్రరావు అన్నారు. గ్రామంలో లబ్ధిదారులతో కలిసి సిఎం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనకాపల్లి : ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పనిచేశారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. స్థానిక జీవీఎంసీ జోనల్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వం పెంచిన పింఛన్లను అందజేశారు. హామీలను మరిచిన చంద్రబాబు నాయుడు, హామీలన్నిటిని నెరవేర్చిన జగన్మోహన్‌ రెడ్డిని బేరీజు వేసుకొని రానున్న ఎన్నికల్లో ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ భీశెట్టి సత్యవతి, వైసిపి నాయకులు మందపాటి జానకరామరాజు, ఏపీఐడబ్ల్యుఏ చైర్మన్‌ దంతులూరి దిలీప్‌ కుమార్‌, సమన్వయకర్త మలసాల భరత్‌ కుమార్‌, నూకంబిక ఆలయ చైర్మన్‌ కొణతాల మురళీకృష్ణ, డాక్టర్‌ రామ్మూర్తి, డాక్టర్‌ విష్ణుమూర్తి, జోనల్‌ కమిషనర్‌ వెంకటరమణ, కార్పొరేటర్‌ మందపాటి సునీత, ఆళ్ల నాగేశ్వరరావు, జాజుల రమేష్‌ పాల్గొన్నారు.

➡️