లలిత జ్యుయలరీస్‌ 52వ షోరూమ్‌ ప్రారంభం

లలిత జ్యుయలరీస్‌ షోరూం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న కిరణ్‌ కుమార్‌, మంత్రి విశ్వరూప్‌, ఎంపీ అనురాధ

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురంలో సినిమా రోడ్‌ లో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత జ్యుయలరీస్‌ 52వ షోరూమ్‌ను మంత్రి పినిపే విశ్వరూప్‌. ఎంపీ చింత అనురాధ చేతుల మీదుగా శనివారం ప్రారంభమైంది. లలిత జువెలరీస్‌ అధినేత కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అతి తక్కువ తరుగు మజూరి లేకుండా నాణ్యమైన మేలిమి బంగారంతో చేసిన ఆభరణాలు, డైమండ్స్‌ అధిక కలెక్షన్స్‌ తో అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని అన్నారు. కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎల్‌సి కుడుపూడి సూర్యనారాయణ రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్ర మణి, తుని నియోజకవర్గ వైసిపి పరిశీలకుడు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానీరా, మున్సిపల్‌ కౌన్సిలర్‌ దొంగ నాగసుధారాణిచిన్న, నాగరపు వెంకటేశ్వరరావు, గొవ్వాల రాజేష్‌, కొర్లాటి దుర్గాబాయి, ఏడిద శ్రీను, చిత్రపు రామకృష్ణ, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నాయకులు కల్వకొలను తాతాజీ, దొమ్మేటి సాయిబాబు, మోక వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️