లాయర్లు, అంగన్‌వాడీలకు కాంగ్రెస్‌ మద్దతు

congress

ప్రజాశక్తి – నిడదవోలుప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నిడదవోలు కోర్టు వద్ద నాలుగు రోజులుగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్‌ కమిటీ పట్టణ అధ్యక్షుడు కారింకి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. అంగన్‌వాడీల దీక్షకు కూడా కాంగ్రెస్‌ పార్టీ తరపున మద్దతు తెలిపారు. న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే కర్కశంగా వ్యవహరిస్తోందన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులు చేయాల్సిన పనిని నిరసన దీక్షలో ఉంటే వేరే సిబ్బందితో చేయించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, ఉషారాణి, షేక్‌ కాశిం, సరిపల్లి రమణ, అన్వర్‌ ఖాన్‌, జిలాని, కిషోర్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️