లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని ఐసిడిఎస్‌ సిడిపిఒ రాజేశ్వరి అన్నారు. శుక్రవారం స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్‌లో భేటీ బచావో బేటి పడావోలో భాగంగా జమ్మలమడుగు, గూడెం చెరువు సెక్టార్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ సిడిపిఒ మాట్లాడుతూ బాలలకు సంబంధించిన చట్టాల పైన ప్రతి అంగన్వాడీ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆడపిల్లలను గౌరవించాలని, వారి జననాలను ప్రోత్సహించాలన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం నేరమని చెప్పారు. వీటిని ప్రోత్సహించినా, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా చేసిన వారు శిక్షార్హులు అవుతారని తెలియజేశారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్‌ మహేష్‌ మాట్లాడుతూ పిల్లలు, మహిళల రక్షణ కోసం ఉన్నటువంటి హెల్ప్‌ లైన్‌ నెంబర్స్‌ పై అవగాహన కల్పించడంతోపాటు గ్రామస్థాయిలో ఉన్న అడల్ట్స్‌ పిల్లల డేటాను ప్రతి అంగన్వాడి సెంటర్లో కలిగి ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సునీత, గౌసియా, బిపిసి రమేష్‌, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెన్నూరు : బాల బాలికల చదువులను ప్రోత్సహించి సమాజాభివద్ధికి దోహదపడాలని అంగన్వాడీ సూపర్‌వైజర్లు నాగరత్నమ్మ, గుర్రమ్మ అన్నారు, జిల్లా మహిళా అభివద్ధి, శిశు సంక్షేమ శాఖ పధక సంచాలకులు శ్రీ లక్ష్మీ ఆదేశాల మేరకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా చింతకొమ్మదిన్నె ఐసిడిఎస్‌ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ప్రాజెక్టు పరిధిలోని చెన్నూరు అంగన్వాడీ సెంటర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ విభాగం లీగల్‌ అధికారి పిఆర్‌ సునీత రాజు, ఒఆర్‌డబ్ల్యు ప్రసన్న లక్ష్మి, ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️