‘లిటిల్‌ సిస్టర్స్‌’ నిర్వాహకులకు సైమన్‌ అవార్డు

మంగళగిరి: సేవా రంగంలో ఉత్తమ సేవలు అం దించిన వారికి ప్రతీ ఏటా శాంతి దూత మినిస్ట్రీస్‌ వారు అందించే సైమన్‌ అవార్డ్‌ – 2023 ను మంగళ వారం జాతీయ రహదారి ప్రక్కనే పెద కాకాని లో ఉన్న వృద్ధాశ్రమం నిర్వాహకులు లిటిల్‌ సిస్టర్స్‌ సంస్థ నిర్వా హకులకు అందించారు వృద్ధాశ్రమం ఇంఛార్జి సిస్టర్‌ జుడిత్‌ అవార్డ్‌ ను అందుకున్నారు. కార్యక్రమం లో మినిస్ట్రీస్‌ ట్రస్ట్‌ అధ్యక్షులు కె.రూఫస్‌, ప్రముఖ సీరియల్‌ రైటర్‌ రవి కొలికపూడి, పాస్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జోసెఫ్‌ కొదమల, కే కే రవి కుమార్‌, పి.తిమోతి, బెల్లంకొండ శివాజీ రాజు, ట్రస్ట్‌ ప్రతినిధులు కె.కవిత, కే. మాధురి, జే. నయోమి నిశ్చల, తదితరులు పాల్గొన్నారు.

➡️