వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయండి : జెసి

ప్రజాశక్తి – రాయచోటి ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలలో వందశాతం లక్ష్యాలను పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ సచి వాలయం నుంచి రెవెన్యూ, రీసర్వే, ఎంపిఎఫ్‌సి గోడౌన్లకు భూ కేటాయింపు, వ్యవసాయం, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్‌, హౌసింగ్‌, ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణం, పిఆర్‌అండ్‌ఆర్‌డి ప్రాధాన్యత భవనాలు, ఉపాధి హామీ – వేజ్‌ జనరేషన్‌, జల్‌ జీవన్‌ మిషన్‌ తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆయా అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు .రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జెసితోపాటు డిఆర్‌ఒ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో జెసి మాట్లాడుతూ జిల్లాలో రెండో దశలో చేపట్టిన రీ సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల రీ సర్వే కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. జాతీయ రహదారుల అంశంలో భాగంగా సేకరించిన భూములకు అవార్డు పాస్‌ చేసిన వాటిని ఎన్‌హెచ్‌ఐ అధికారులకు వెంటనే స్వాధీనం చేయాలన్నారు. భూమిరాశి పోర్టల్‌లో ప్రాజెక్టు వారి ప్రగతి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎంపీఎఫ్‌సి గోడౌన్లకు భూ కేటాయింపు అంశాన్ని సమీక్షించి కార్యాచరణను వేగవంతం చేయాలన్నారు. ఇటీవలి మిచౌంగ్‌ తుపాను దాటికి జిల్లాలో నష్టపోయిన వ్యవసాయ ఉద్యాన పంటల వివరాల నమోదును త్వరితగతిన పూర్తి చేసి ఆయా గ్రామాలలో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులకు సూచించారు. జిల్లాలో గహ నిర్మాణాలను వేగవంతం చేయాలని. జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యం దిశగా త్వరితగతిన ఇళ్లను పూర్తి చేయించాలని చెప్పారు. పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ పథకాల అమలను సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రపై విస్తతంగా అవగాహన కల్పించాలని పంచాయతీ అధికారులకు సూచించారు. పాడి పరిశ్రమ అభివద్ధిలో భాగంగా మహిళా పాడి రైతులకు అవసరమైన రుణాలు అందించాలని, జగనన్న పాలవెల్లువ కార్యక్రమాలలో లక్ష్యాలను సాధించాలని, జల్‌ జీవన్‌ కార్యక్రమం లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు కషి చేయాలని జెసి పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️