వక్ఫ్‌ ఆస్తులను రక్షించండి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ముఖ్యమంత్రి జిల్లా, మైనార్టీ మంత్రి నియో జక వర్గంలోనే అత్యధి కంగా వక్ప్‌ ఆస్తులు అన్యా క్రాంతమవుతున్నాయని, వాటి ని రక్షించాలని .మైనారిటీ రైట్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ దస్తగిరి కోరారు. శుక్రవారం జిల్లా వక్ఫ్‌ బోర్డు జిల్లా అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో, నగరంలో వక్ఫ్‌ బోర్డ్‌ ఆస్తులను పరిరక్షించాలని పేర్కొన్నారు. సూచిక బోర్డులు, ప్రహరీని నిర్మించాలని, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా భూములను, ఆస్తులను కాపాడాలని కోరారు. నగరంలో రవి థియేటర్‌ గ్రూప్స్‌ వద్ద ఉన్న వక్ఫ్‌ బోర్డు సూచిక బోర్డు తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా జాకీర్‌ హుస్సేన్‌, ఎస్‌ డి పి ఐ జిల్లా అధ్యక్షులు షేక్‌. చాంద్‌ బాషా, అన్వర్‌, జహీర్‌ పాల్గొన్నారు.

➡️