వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తా : ఆర్‌ఆర్‌

ప్రజాశక్తి-రామాపురం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ప్రతి కార్యకర్త రుణం తీర్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి అన్నారు.మండల కేంద్రమైన రామాపురంలోని మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం.రమేష్‌రెడ్డి స్వగహంలో బుధవారం ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, ఆర్‌ఆర్‌ అభిమానులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని తాను పనిచేసిన విధంగా ఏ ఒక్క నాయకుడు కూడా పనిచేయలేదని అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పార్టీకి కష్టపడి కార్యకర్తలతో నాయకులతోనూ మమే కమవుతూ పార్టీ పటిష్టానికి కృషి చేశానని చెప్పారు. కొందరు నాపై అధిష్టా నానికి తప్పుడు సమాచారం ఇచ్చి తాను సరిగ్గా పని చేయలేదన్న చెప్పడం చాలా బాధించిందని అన్నారు. నేను పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడ్డానని, గ్రామ గ్రామం తిరిగానని, తొక్కని గడపంటూ లేదని అన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లానని, కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ఆత్మీయ బంధువు లుగా ఉన్న కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన అన్నారు. రాబోయే రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలో పోరా టాన్ని మనమందరం కొనసాగించాలని నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. స్థానిక ఎమ్మెల్యే చెరువులకు నీళ్లు నింపుతామని ఒట్టి మాటలు చెప్పి చేసింది ఏమి లేదన్నారు. రాయచోటి నియోజకవర్గంలో మూడు వేల కోట్లతో అభివద్ధి చేసామని చెప్తున్నారని ఎక్కడ చేశారో చూపించాలని ఆయన ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం రమేష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి. నాగేందర్‌రెడ్డి, మాజీ జడ్‌పిటిసిలు, నాగ సుబ్బారెడ్డి నర్సారెడ్డి, భాస్కర్‌రెడ్డి నరేందర్‌ రెడ్డి వెంకటరామిరెడ్డి, చంద్రమౌళి, రామకష్ణ గౌడ్‌ నాగభూషణ్‌ రెడ్డి, ఖాదరవల్లి హరిప్రసాద్‌ షంషేర్‌, ప్రభాకర్‌, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఆర్‌ఆర్‌ అభిమానులు పాల్గొన్నారు.

➡️