వడ్రంగి కార్మికుల వనభోజనాలు

Dec 11,2023 16:42
తాళ్ళరేవు లో కార్తీక

ప్రజాశక్తి – తాళ్లరేవు

శివ గణేష్‌ వడ్రంగి పనివార్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక పరదేశమ్మ వారి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు రేఖాడి మహేష్‌, గోవిందు, యూనియన్‌ నాయకులు నాగరాజు, వీరబాబు, బాబ్జి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలే కలిసి మెలిసి, స్నేహపూర్వకంగా సంఘం అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ, దుగ్గుదూరు, రామచంద్రపురంకు చెందిన భీమేశ్వర, లక్ష్మీ గణపతి, కామాక్షి కార్పెంటర్‌ యూనియన్ల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

➡️