వరికపూడిశెల పనులు ప్రారంభించండి

Jan 30,2024 00:14

మంత్రి అంబటి రాంబాబుకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
వరికపూడిశెల ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని, దీనిపై మంత్రి మండలిలో చర్చించి నిధులు కేటాయించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును ప్రాజెక్టు పోరాట సాధన కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రిని స్థానిక క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు వి.కోటానాయక్‌, పి.రూబెన్‌, కె.హనుమంతరెడ్డి, బి.వీరయ్య మాట్లాడుతూ బుధవారం జరిగే మంత్రి మండలి సమావేశంలో వరికపూడిశెల ప్రాజెక్టు గురించి చర్చించి, బడ్జెట్‌ కేటాయించే విధంగా తీర్మానించాలని, వచ్చేనెల మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ రూ.1600 కోట్లు కేటాయించి, చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రాజెక్టుకు సిఎం శంకుస్థాపన చేసి ఇప్పటికే 77 రోజులైందని, అయినా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని చెప్పారు. ఇప్పటికైనా పనులను ప్రారంభించకుంటే ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంత్రి రాంబాబు స్పందిస్తూ ప్రాజెక్టు నిర్మాణం తన బాధ్యతని చెప్పారు.

➡️