వరికపూడిసెల పనులకు ప్రారంభోత్సవం

Mar 12,2024 23:55

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : పల్నాటి ప్రజల 70 ఏళ్ల కల వరికపూడిసెల నిర్మాణ పనులను నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైసిపి రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దాదాపు 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో పొలాలు ఎవరూ అమ్ముకోవాల్సిన అవసరం లేదని, ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతాయని చెప్పారు. వైసిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

➡️