వాలీబాల్‌ పోటీల విజేత దామనాపల్లి

విజేతగా నిలిచిన దామనాపల్లి జట్టు సభ్యులు

ప్రజాశక్తి-సీలేరు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా జీకే వీధి మండల స్థాయి వాలీబాల్‌ ఫైనల్‌ పోటీల్లో దేవరపల్లి పంచాయతీ జట్టుపై దామనాపల్లి పంచాయితీ జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. 16 పంచాయతీల నుండి వాలీబాల్‌ పోటీల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన దామనాపల్లి జట్టుకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలోనూ గెలుపొందాలని ఆక్షాంక్షించారు. సచివాలయ కార్యదర్శి గడుతూరి కళ్యాణ్‌ కృష్ణ మాట్లాడుతూ క్రీడల్లో యువత రాణించినప్పుడు ఉన్నత శిఖరాలు అందిపుచ్చుకోవచ్చునని తెలిపారు. దేవరాపల్లి సెక్రెటరీ వెంకటేశ్వర్లు, దామనపల్లి ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ యుగంధర్‌, లకవరపేట డిజిటల్‌ అసిస్టెంట్‌ మద్దెల ప్రసాద్‌, ఇతర సచివాలయ సిబ్బంది దామనాపల్లి జట్టును అభినందించారు.

➡️