వాల్టాకు తూట్లు

Dec 9,2023 21:03

 ప్రజాశక్తి-శృంగవరపుకోట  :  పట్టణంలో పుణ్యగిరికి వెళ్లే రహదారిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాల్టా చట్టాన్ని ఉల్లంఘించారు. ఇష్టారాజ్యంగా చెట్లు నరికేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో నరికేసిన చెట్లను సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ పరిశీలించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని రమణ తెలిపారు. పత్రికా ప్రకటన, టెండర్లు లేకుండా, అటవీశాఖ, రెవెన్యూ అనుమతులు తీసుకోకుండా ఖరీదైన వృక్షాలు కళాశాల ప్రిన్సిపల్‌ అమ్మేయడం దారుణమన్నారు. రూ.లక్షలు విలువైన చెట్లను డబ్బులకు కక్కుర్తి పడి వేల రూపాయలకు అమ్మేశారని తెలిపారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కళాశాల విస్తీర్ణం సుమారు 15 ఎకరాలని, ఇప్పటికే కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి, లేఅవుట్లు వేసుకున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️