వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ

Nov 29,2023 23:36

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో డిసెంబర్‌ 10న కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు ఎం.రమేష్‌ బాబు కోరారు. యర్రగొండపాలెంలోని ఏరియా వైద్యశాలలో మహాసభకు సంబంధించిన వాల్‌పోస్టర్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కీలకంగా ఉంటూ చిత్తశుద్ధి, అంకిత భావంతో పని చేస్తున్నారని తెలిపారు. వేతనాలు చాలా తక్కువ అయినప్పటికీ వారికి కేటాయించిన పనిని సకాలంలో పూర్తి చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలలో భాగస్వామ్యులు అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఔట్‌ సోర్సింగ్‌ నాయకులు విజయకుమారి, పోలరాజు, పి.శ్రీకాంత్‌, జి.వెంకటేశ్వర్లు, సిహెచ్‌.చిరంజీవి, కె.శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

➡️