విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించండి

చిలకలూరిపేట: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను, ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరిం చాలని విఆర్‌ఎల సంఘం (సిఐటియు అను బంధం) పట్టణాధ్యక్షులు ఆనంద కుమార్‌ గురువారం అన్నారు. స్థానిక తహ శీల్దార్‌ కార్యాలయం ఎదుట విఆర్‌ఎలు సిఐటియు మండల కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సంద ర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ విఆర్‌ఎల సమస్యలను వెంటనే పరి ష్కరించని పక్షంలో ఈ నెల 29 వ తేదీన నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమస్య లు పరిష్కరం కాకపోతే జనవరి 5వ తేదీన మంగళగిరిలో సీసీఎల్‌ వద్ద నిరాహార దీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అనంతరంఆనంద్‌ కుమార్‌ మా ట్లాడుతూ ఖాళీగా ఉన్న గ్రామ రెవెన్యూ సహా యకులు పోస్టులను వీఆర్‌ఏల చేత భర్తి చేయాలని తెలంగాణ రాష్ట్రంలో లాగా విఆరఎ లకు పే స్కేల్‌ వర్తింప చేయా లని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం ప్రకటించిన రూ.500 డి.ఏ.ను 2018 జూన్‌ నాటి నుంచి వేతనంతో కూడిన డిఎగా తక్ష ణమే కొనసాగించాలన్నారు. రికవరీ చేసిన అమౌంట్‌ ను వీఆర్‌ఏల ఖా తాకు వెంటనే జమ చేయాల అన్నారు. నామినేలుగా పని చేస్తున్న వీఆర్‌ఏలను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఒ క్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీ ఆర్‌ఏలకు కూడా వర్తింప చేసే విధం గా వెంటనే చర్యలు తీసుకోవాలన్నా రు. రీ సర్వేలకు వీఆర్‌ ఏలను సొంత గ్రామాలలోనే పనిచేసే విధంగా చర్య లు తీసు కోవాలన్నారు. గ్రామ రెవె న్యూ సహాయకుల చేత అక్రమ డ్యూ టీలను చేయించరాదు అన్నారు. వీఆర్‌ఏలను సర్వీసుకు నిబంధనలకు వ్యతిరేకంగా పని చేయించరాదని,అంతే కాకుండా శ్రమ దో పిడికి గురవు తున్నారని దీనిని వెంటనే ని లుపుద చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి పలు డి మాం డ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల తహశీల్దార్‌ జి.సుజాతకు అంద జేశారు. నకరికల్లు: స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం వద్ద విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు మాట్లాడారు.అనంతరం తహశీల్దార్‌ నగేష్‌ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అంద జేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల మండల ప్రెసిడెంట్‌ షేక్‌ సైదా, సీతయ్య, కోటేశ్వరరావు, అదం సాహెబ్‌ ,కుంభ అం కమ్మ, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు. పెదకూరపాడు: వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిం చాలని పెదకూరపాడు తహశీల్దార్‌ కార్యా లయం వద్ద వీఆర్‌ఏలు (సిఐటియు) నిరసన తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్‌ నిర్మల కృష్ణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర ్‌ఏల సంఘం అధ్యక్షులు షేక్‌ బంద్గీ సాహె బ్‌, భద్రాచలం, కొండలు పాల్గొన్నారు. అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు డిమాండ్‌ చేశారు. నేడు వీఆర్‌ఏలు రాష్ట్ర వ్యాప్తంగా భాగంగా సమస్యల పరి ష్కరిం చాలని కోరుతూ సీనియర్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏ మండల అధ్యక్షుడు మల్లెపువ్వు కోటేశ్వ రరావు మాట్లాడారు.

➡️