వికలాంగులు, అంధుల సమస్యలను పరిష్కరిస్తా

 పల్నాడు జిల్లా: వికలాంగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో శని వారం నిర్వహించిన వికలాంగులతో జిల్లా కలెక్టర్‌ ముఖాముఖి నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన 70 మందికి పైగా వికలాంగులు తమ సమస్యలు పరిష్కరిం చాలని కలెక్టర్‌ కు వినతి పత్రాలను సమ ర్పించారు. ముందుగా లూయిస్‌ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి కల ెక్టర్‌ నివాళులర్పించారు. వికలాంగుల సమస్య లను అడిగి కలెక్టర్‌ తెలుసుకున్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని సంబంధిత అధికారులకు సూచిం చారు. ప్రతి నెలా 4వ తేదీన విక లాంగులు, అంధులు, ట్రాన్స్‌జెండర్లు, వయో వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సమావేశానికి విచ్చేసిన వికలాంగులకు, భోజన వసతి కల్పిం చారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ వినా యకం, జిల్లా డిజేబుల్‌ వెల్ఫేర్‌ ఏడి సువార్త, డిఎంహెచ్‌ఒ రవి, డి.సి. హెచ్‌.ఎస్‌ రంగారావు పాల్గొన్నారు. లింగ నిర్ధారణ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: కలెక్టర్‌ జిల్లా స్థాయి మల్టీ మెంబెర్‌ అప్ప్రొప్రైట ఆధారిటీ, డిస్టిక్‌ లెవెల్‌ అడ్వైజరీ కమిటీ సంయుక్త సమావేశం కలెక్టర్‌ కార్యా లయంలో ఎస్‌.ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. సమావేశానికి హాజరైన కమిటీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం 1994 సమర్థవంతంగా అమలు చేయాలని, ఈ చట్టం పరిధి అతి క్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణ చేసినట్లు తెలిస్తే చట్ట పరిధిలో శిక్షార్హులవుతారని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు 161 ప్రైవేటు ,ప్రభుత్వ ఆసుపత్రులు లింగ నిర్ధారణ చటం పరిధి కింద అనుమతులు తీసుకున్నట్లు చెప్పారు. వీరందరూ కూడా చట్ట ప్రకారము నిబంధనలకు లోబడి అన్ని రకాల రికార్డులను సక్రమంగా అమలు చేయాలని అన్నారు. జిల్లాలో కొత్తగా 4 స్కాన్‌ సెంటర్లకు, 10 రెన్యువల్స్‌ కు, 9 మార్పుల కోసం నమోదు చేసుకున్న వారికి లింగ నిర్ధారణ చట్టం కింద అను మతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బి.రవి, నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి. గీతాం జలి, డి సి హెచ్‌ ఎస్‌ డాక్టర్‌ రంగారావు,మహిళా సంఘం నాయకురాలు డి.శివకుమారి, రెడ్‌ క్రాస్‌ సభ్యులు డాక్టర్‌ ఎం.వసంత కిరణ్‌, దిశ డిఎస్పీ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️