విజయపథంలో అమరరాజా : గల్లా జయదేవ్‌

Dec 20,2023 22:25
అమరరాజా సంస్థ వార్షికోత్సవ సభ

విజయపథంలో అమరరాజా : గల్లా జయదేవ్‌ప్రజాశక్తి – రేణిగుంటఅమరరాజ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ గొప్ప విజయాలతో ముందుకు సాగుతోందని చైర్మన్‌ జయదేవ్‌ గల్లా స్పష్టం చేశారు. బుధవారం కరకంబాడి సమీపంలోని అమరరాజ పారిశ్రామిక కర్మాగారంలో 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమర రాజా గ్రూప్‌ చైర్మన్‌ జయదేవ్‌ గల్లా మాట్లాడుతూ తమ వ్యాపారాలన్నింటి కోసం అపార అవకాశాలను కలిగి ఉన్న నూతన భవిష్యత్తులోకి అడుగుపెడుతున్నప్పుడు తమ ప్రయాణంలో ప్రతి అడుగులో ఎల్లప్పుడూ ముందుంటామని తాము విశ్వసిస్తున్నామన్నారు. గత 38 సంవత్సరాలలో తాము నిర్వహిస్తున్న పరిశ్రమలను పునర్నిర్వచించామన్నారు. గొప్ప విజయాలతో ముందుకు సాగగలమని గట్టిగా నమ్ముతున్నామని అన్నారు.1985లో అమర రాజ పవర్‌ సిస్టమ్స్‌గా కార్యకలాపాలను ప్రారంభించిన గ్రూప్‌ ఇప్పుడు 6 కంపెనీలు 17 వ్యాపారాలు, 16వేలకు పైగా ఉద్యోగుల సంఖ్యతో అభివద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు గ్రామీణ పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి వారికి 3 లక్షల నగదు బహుమతి అమర రాజా కు చెందిన మార్కెటింగ్‌ హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌ సప్లై చెయిన్‌ సి ఎక్స్‌ ఓ లతో ఒక సంవత్సరం పాటు మెంబర్‌షిప్‌ అందించామన్నారు. అమర రాజా లో 25 సంవత్సరాలు పైగా పనిచేస్తున్న 135 మంది ఉద్యోగులకు లాంగ్‌ సర్వీస్‌ అవార్డ్స్‌ అందించారు. భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్‌ అధికారి డా. కిరణ్‌ బేడీ మాట్లాడుతూ ఉద్యోగులను చైతన్యపరిచారు. కేరళకు చెందిన ఒక బందం ప్రసిద్ధ యుద్ధ కళల రూపం కలరి పయట్టు గొప్ప సంప్రదాయాన్ని కళ యొక్క 3వేల సంవత్సరాల చరిత్రను ప్రదర్శించిందన్నారు. అనంతరం కేరళ వారిచే సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. అమర రాజా వ్యవస్థాపక చైర్మన్‌ డా. రామచంద్ర నాయుడు గల్లా, గల్లా అరుణ కుమారి, డాక్టర్‌ రమాదేవి గౌరినేని, హర్షవర్ధన్‌ గౌరినేని, విక్రమాదిత్య గౌరినేని, సిద్ధార్థ్‌, అశోక్‌ గల్లా పాల్గొన్నారు.అమరరాజా సంస్థ వార్షికోత్సవ సభ

➡️