విజయ కుమార్‌కు మంత్రి సురేష్‌ నివాళి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు సన్నెపోగు విజయకుమార్‌(60) అనారోగ్యంతో ఆదివారం యర్రగొండపాలెంలోని ఇజ్రాయేలు పేటలో గల ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్‌, జడ్పి కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌ బాషా, వైసీపీ మండల కన్వీనర్లు కొప్పర్తి ఓబుల్‌రెడ్డి, సింగారెడ్డి పోలిరెడ్డి, సర్పంచ్‌లు రామావత్‌ అరుణాబాయి, కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ మన్నె రవీంద్ర, మాజీ ఏఎంసి చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, నాయకులు తోటా మహేష్‌ నాయుడు, షేక్‌ జిలాని, షేక్‌ ఇస్మాయిల్‌, మండల పరిషత్‌ అధికారులు పాల్గొని ఆయన భౌతికాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️