విత్తనశుద్ధితో తెగుళ్ల బారి నుంచి రక్షణ

కొత్తపట్నం : విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చునని ప్రకృతి వ్యవసాయం ఇన్‌ఛార్జి ఇందిర తెలిపారు. మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో ఎం రఘుపతి, సదావలి, సుబ్బారెడ్డి అనే రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బీజామృతంతో విత్తనశుద్ధి చేసి శనగ, మినుము విత్తనాలు సోమవారం ఎదబెట్టారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ విత్తన శుద్ధి చేయడం వల్ల వేరు వ్యవస్థ బలపడుతుందని, తద్వారా కాండం కుళ్లు, ఇతర తెగుళ్లు పంటలకు సోకవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటిఎల్‌ వికాష్‌రెడ్డి, ఇందిర, ఐసిఆర్‌పి మాధురి, రైతులు పాల్గొన్నారు.

➡️