విద్యకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే పిన్నెల్లి

 మాచర్ల : పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి జగ న్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్యాబ్‌లను విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఇఒ వేముల నాగయ్య పాల్గొన్నారు.

చేబ్రోలు: మండలంలోని శేకూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ శాలలో శుక్రవారం ఉచిత ట్యాబ్‌ ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పాల్గొన్నారు. సమావేశంలో తహశీల్దార్‌ కె వి గోపాలకృష్ణ, చేబ్రోలు మండల అధ్యక్షులు కె.సాహితి కిరణ్‌, ప్రధానోపాధ్యాయులు కె.సత్యనారా యణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 మంగళగిరి : స్థానిక మునిసిపల్‌ వివర్స్‌ కాలనీ హైస్కూల్లో ట్యాబుల్‌ పం పిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హను మంతరావు, నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి గంజి చిరంజీవి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్‌ శ్రీనివాసరావు, యు.ఏడుకొండలు పాల్గొన్నారు.

 దుగ్గిరాల: స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో 163 మంది ఎనిమిదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా ఎనిమిదో తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులు 541 మంది ఉండగా ఇప్పటికీ 270 ట్యాబ్లు వచ్చాయని మిగతావి త్వరలో రానున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి తదితరలు పాల్గొన్నారు.

 తాడేపల్లి:తాడేపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్లోని విద్యార్థులకు శుక్ర వారం ట్యాబ్‌లను పం పిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమిరెడ్డి తాతిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 240 మంది 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్‌లు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, మండల విద్యా శాఖాధికారిణి శాంత కుమారి, మాజీ ఎంపిపి దొంతిరెడ్డి వేమారెడ్డి , విద్యాకమిటీ ఛైర ్‌పర్సన్‌ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

➡️