విద్యారంగానికి అధిక ప్రాధాన్యత

ప్రజాశక్తి- కొత్తపట్నం : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. కొత్తపట్నంలోని సాంఘిక సంక్షేమ సమీకత బాలికల వసతి గహంలో జివిఆర్‌ సంస్థ సహకారంతో రూ.11.04 లక్షలతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను కలెక్టర్‌ బుధవారం ప్రసారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మనబడి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, కార్పొరేట్‌ సంస్థలు ముందుకొచ్చి పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్‌ కోరారు. పేద పిల్లలు చదువుతున్న సాంఘిక సంక్షేమ సమీకత బాలికల వసతి గహంలో మౌలిక సదుపాయాల కోసం రూ.11.04 లక్షలు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. అందుకు తోడ్పాటునందించిన జివిర్‌ సంస్థ, సంస్థ తరుపున హాజరైన మేనేజర్‌ బంగారయ్య, వెంకటేశ్వర్లు ను జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. జివిఆర్‌ సంస్థ మేనేజర్‌ బంగారయ్య మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గహంలోని పిల్లలకు అవసరమైన మౌలిక సదు పాయాలకు సహకరించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు కోరినట్లు తెలిపారు. తాను జివిఆర్‌ సంస్థ దష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్పందించిన జివిఆర్‌ సంస్థ ప్రతినిధులు రూ .11.04 లక్షలతో వసతి గృహంలో విద్యార్థినులకు అవసరమైన మంచాలు, తాగునీటి వసతి, పైప్‌ లైన్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్‌, తహశీల్దారు సురేష్‌, ఎంపిడిఒ ఫణి కుమార్‌ నాయక్‌, వసతి గహం వార్డెన్‌ అరుణ కుమారి, బాలుర వసతి గహం వార్డెన్‌ మురళి, హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️