విద్యార్థులకు ట్యాబులు పంపిణీ

Dec 28,2023 15:35 #East Godavari

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : మండలంలోని మాధవరాయుడు పాలెం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ 8వ తరగతి విద్యార్థులకు గ్రామ సర్పంచ్‌ అన్నందేవుల చంటి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్‌తో కలిసి గురువారం ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ చంటి మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు చెప్పినట్లు వింటూ మేధస్సును పెంపొందించుకునేందుకు ట్యాబులు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడునేడు అభివద్ధి పనులను, వంటశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గొల్లపల్లి వెంకటేశ్వరరావు,ఎస్‌ ఎం సి చైర్మన్‌ పడాల శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️