విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు చేతుల మీదుగా ట్యాబ్‌లను పంపిణీ జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీజేఆర్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని విద్యా కార్యక్రమాలను జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు అందిస్తున్నారని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి రామారావు అధ్యక్షత వహించగా వైసిపి మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, జడ్పిటిసి దుంపా రమణమ్మ, ఎంపీపీ విజయ, గ్రామ సర్పంచ్‌ దర్శి నాగమణి, వైస్‌ ఎంపీపీ టి రాగమ్మ ఎంపీటీసీ బి సుబ్బారావు, సొసైటీ చైర్‌పర్సన్‌ దుంపా యలమందారెడ్డి, ఎంఈఓ-2 వెంకారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ మారెళ్ల బంగారుబాబు, వైస్‌ చైర్మన్‌ ఎస్‌ పాండురంగారావు, పీడీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్‌ పెనుబోతు రంగారావు తదితరులు పాల్గొన్నారు. కొనకనమిట్ల: మండలంలోని చిన్నారికట్ల, కొనకనమిట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ ట్యాబ్‌లను గురువారం అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ ట్యాబ్‌లను విద్యార్థులకు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు. కొనకనమిట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పిఎంసి చైర్మన్‌ కడెం ఆంజనేయులు ట్యాబ్‌లను అందుకున్న విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్‌ మామయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి విభాగం జాయింట్‌ సెక్రెటరీ ఏలూరు సంజీవరెడ్డి, పీఎంసి చైర్మన్‌ మారావత్‌ బాలనరసయ్య, ఎంపిటిసి ధనలక్ష్మి, కొనకనమిట్ల ప్రధానోపాధ్యాయులు శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పొదిలి: మర్రిపూడిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ఎంపీపీ వాకా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మండల పరిషత్‌ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు ఎంపిపి వాకా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️