విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

ప్రజాశక్తి- కంభం : మండల పరిధిలోని జంగంగుంట్ల హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం ట్యాబ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా జంగంగుంట్ల నివాసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న నెమిలిదిన్నె రంగారెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు వరుసగ రూ.10వేలు, రూ.7,500, రూ.5,000 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జనార్ధన్‌ రెడ్డి మిత్రుడు చలమయ్య సహకారంతో విద్యార్థులకు రూ.60 వేల విలువైన స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సుజాత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ కోటయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గని వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

➡️