విద్యార్థులకు పుస్తకాలు అందజేత

ప్రజాశక్తి- కొత్తపట్నం : కొత్తపట్నం మండలం అల్లూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువు తున్న విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పూర్వ జడ్జి వి. నాగేశ్వరరావు సహ కారంతో యండమూరి వీరేంద్రనాథ్‌ రచించిన మొదటి ర్యాంకుకు 100 సూత్రాలు పుస్తకాలు, బిస్కెట్లు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు యండమూరి రచించిన మొదటి ర్యాంకుకు వంద సూత్రాలు పుస్తకాన్ని బాగా చదివి మంచి మార్కులు సాధించి తమ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. చెడు స్నేహాలు, అలవాట్లకు బానిసలు కారాదని తెలిపారు. సెల్‌ఫోన్‌, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను అర్థం చేసుకొని మంచి మార్కులతో విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ మెజీషియన్‌ బివి. రామన్‌ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ ఆలోచనతో ఉండాలని కోరుతూ మ్యాజిక్‌ రూపంలో విద్యార్థులను చైతన్య పరిచాడు సిఐటియు నాయకుడు పసుపులేటి నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యుడు కె .చిన్న వెంకట సుబ్బారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️