విద్యార్థులకు బహుమతులు అందజేత

Jan 8,2024 21:41
ఫొటో : విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఎంపిడిఒ నాగమణి

ఫొటో : విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఎంపిడిఒ నాగమణి
విద్యార్థులకు బహుమతులు అందజేత
ప్రజాశక్తి-మర్రిపాడు : విద్యావేత్త, సంఘసంస్కర్త షేక్‌.ఫాతిమా జయంతిని పురస్కరించుకొని మండల ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులను ఎంపిడిఒ నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగా ఫాతిమా షేక్‌ చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. మండల అవాజ్‌ కమిటీ ఉపాధ్యక్షులు రహమతుల్లా మాట్లాడుతూ సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని ఉద్దేశంతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేతో ఫాతిమా షేక్‌ కలిసి ఆడ పిల్లలకు చదువులు కావాలని పోరాటం చేశారని వారి పోరాటాల ఫలితమే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు. కార్యక్రమంలో ఆవాజ్‌ మండల కార్యదర్శి సయ్యద్‌ గౌస్‌ బాషా, ఆవాజ్‌ కమిటీ సభ్యులు ఫఠాన్‌ రసూల్‌, కాలేషా, రామయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మి దేవి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️