విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి : డిఇఒ

ప్రజాశక్తి-రాయచోటి పదో తరగతి పరీక్షలు రాసి విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శివ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సాయి స్కూల్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూల్స్‌ విద్యార్థుల కోసం మార్చి 3వ తేదీ సాయి బాబా గుడిలో వ్యక్తిత్వ వికాసం, ఒత్తిడిని అధిగ మించడం, పబ్లిక్‌ పరీక్షలలో మంచి మార్కులు సాధించడం ఎలా అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ సుబ్రహ్మణ్యం హాజరవుతారని వివరించారు. విద్యార్థులందరూ పాల్గొనేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యం, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖదారి బాలాజీ నాయక్‌, శ్రీసాయి ఇంజినీరింగ్‌ కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️