విద్యార్థుల్లో పోటీ తత్వం ఉండాలి

Jan 7,2024 21:54

ప్రజాశక్తి – వీరఘట్టం : చదువు పట్ల విద్యార్థుల్లో పోటీతత్వం ఉండాలని మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు విద్యార్థులకు సూచించారు. ఆదివారం స్థానిక శ్రీ గాయత్రి పాఠశాల, కళాశాలలో యుటిఎఫ్‌ మండలశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నవోదయ మోడల్‌ టెస్టు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పోటీతత్వం ఉండడం వల్ల విద్యార్థుల్లో వెనుకబాటు తనం ఉండదని, తద్వారా ఎలాంటి పరీక్షలు అతి సునాయాసంగా రాయగలరని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు మీడియంలో 177 మంది, ఇంగ్లీష్‌ మీడియంలో 77 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు. జిల్లాస్థాయిలో జియ్యమ్మవలసకు చెందిన ఎల్‌.పార్థవ్‌ ప్రథమ, వీరఘట్టానికి చెందిన వి.జీవన్‌ ద్వితీయ, జియ్యమ్మవలసకు చెందిన ఎల్‌.గౌతం ఎంపికైనట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రథమ స్థానంలో బొడ్లపాడు చెందిన రోహన్‌, ద్వితీయ స్థానంలో హుస్సేన్‌పురానికి చెందిన కె.సాయిచరణ్‌, తృతీయ స్థానంలో కిమ్మి గ్రామానికి చెందిన జి.మోహన్‌నాయుడు ఎంపికయ్యారు. ఆయన చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.దుర్గాప్రసాద్‌, కె.గోవిందరావు, గౌరవాధ్యక్షులు ఎ.స్వామిబాబు, కళాశాల కరస్పాండెంట్‌ ఎస్‌.లోకేష్‌, కార్యవర్గ సభ్యులు జెవి సూర్యప్రకాష్‌, వాసుదేవరావు, సతీష్‌, అన్నాజీరావు, ముకుందరావు, చంద్రమోహన్‌, బాలమురళి, కె.గోవిందరావు, ఎస్‌.రాంబాబు, ఎ.రాంబాబు, చంద్రమౌళి, విజయభాస్కర్‌, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో మొదటి 30 స్థానాలు పొందిన వారికి తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో ఈనెల 12న ఉదయం 9 గంటలకు మోడల్‌ గ్రాండ్‌ టెస్ట్‌ ఉంటుందని యుటిఎఫ్‌ మండల శాఖ తెలిపింది. హై స్కూల్‌ మోడల్‌ టెస్ట్‌కు విశేష స్పందన గుమ్మలక్ష్మీపురం :జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్‌లో గల తిరుమల సాయి హైస్కూల్‌ వారు గత 23 ఏళ్లుగా జవహర్‌ నవోదయ మోడల్‌ టెస్టును నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన మోడల్‌ పరీక్షకు ఉమ్మడి జిల్లాల నుంచి 16 మండలాల్లో గల 334 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై ప్రవేశ పరీక్ష మెలకువలను నేర్చుకొని జనవరి 20న నిర్వహించబోయే జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్షకు ఆత్మవిశ్వాసంతో సంసిద్ధులయ్యారు. ఆదివారం నిర్వహించిన పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎంఇఒ శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. మొదటి బహుమతి గొల్ల మోహన్‌ స్వరూప్‌ (తిరుమల సాయి హై స్కూల్‌ విద్యార్థి 93మార్కులు), రెండవ బహుమతి గెంబల లాస్య అందుకుంది. మొత్తం 19 మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో చినమేరంగి ఎస్‌ఐ కళాధర్‌, అకాడమిక్‌ డైరెక్టర్‌ ఆర్‌ వెంకటరమణ, హెచ్‌ఎం జి. ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

➡️