విద్యాసామగ్రి అందజేత

Jan 2,2024 22:05
ఫొటో : విద్యాసామగ్రిని అందజేస్తున్న డాక్టర్‌ శాంతి

ఫొటో : విద్యాసామగ్రిని అందజేస్తున్న డాక్టర్‌ శాంతి
విద్యాసామగ్రి అందజేత
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యాసామగ్రిని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ శాంతి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో జరిగిబోయే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతలు అవ్వడానికి ఈ మెటీరియల్స్‌ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, సొంత నిధులతో విద్యార్థులకు ఈ మెటీరియల్స్‌ను అందజేయడం అభినందనీయమని యుటిఎఫ్‌ నాయకులన్నారు. ప్రతిఒక్క విద్యార్థి కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షల్లో మంచిమార్కులు తెచ్చుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి శాంతిని యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించి యుటిఎఫ్‌ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఎంఇఒ-2 ధనలక్ష్మి, యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్‌, యుటిఎఫ్‌ నాయకులు నాయబ్‌, మోహన్‌ ప్రసాద్‌, సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు పద్మలత, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️