విద్యుత్‌ శాఖ ఈఈ తీరుపై ఉద్యోగుల ఆగ్రహం

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: మార్కాపురం డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పివివి నాగేశ్వరరావు వ్యవహారశైలిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో స్థానిక ఈఈ కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమం బుధవారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు కొంతమంది ఉద్యోగులపై ప్రేమతో… మరి కొందరిపై వివక్షతో ఉంటున్నారని మండిపడ్డారు. ఈఈ పద్ధతి మార్చుకోని పక్షంలో మాస్‌ లీవ్‌లో వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని యూనియన్‌ ప్రతినిధులు హెచ్చరించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తే పెద్దఎత్తున ఆందోళన చేపట్టేందుకు సైతం వెనకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో డివిజన్లోన్ని అన్ని మండ లాల నుంచి విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️