వినియోగదారుల హక్కులపై అవగాహన

వినియోగదారుల హక్కులపై అవగాహన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరంకన్జ్యూమర్‌ వాయిస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక హుకుంపేటలోని జెడ్‌పి పాఠశాలలో విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విజిలెన్స్‌ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు మాట్లాడారు. ప్రభుత్వం వినియోగదారుల హక్కులను పాఠ్యాంశంలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచీ వినియోగదారుల హక్కులను తెలుసుకుంటే సమస్యల పరిష్కారం సులువవుతుందన్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-11-4000, ఎన్‌సిహెచ్‌ యాప్‌, సైబర్‌ క్రైమ్‌లపై 1930లో సంప్రదించాలన్నారు. జిల్లాలోని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి సమస్యకు పరిష్కారం, నష్టపరిహారం పొందవచ్చన్నారు. జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు అమరావాడి రామకృష్ణ మాట్లాడుతూ వస్తువు కొనేటప్పుడు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కన్జ్యూమర్‌ క్లబ్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, పాఠశాల హెచ్‌ఎం బిఎన్విఎస్‌ మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️