వినుకొండలో ఆటోనగర్‌కు శంకుస్థాపన

Jan 31,2024 00:22

ప్రజాశక్తి – వినుకొండ : పట్టణంలోని మార్కా పురం రోడ్డు డాలర్‌ సిటీ పక్కన ఆటో నగర్‌కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం వినుకొండ మేకానిక్స్‌ కోసం 470 మంది సభ్యులతో కూడిన ప్రగతి మోటార్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు రూ.20 కోట్లతో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామని చెప్పారు. ఆటోనగర్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, విద్యుత్‌, డ్రెయినేజీ, ఇతర సదుపాయాల ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పారు. లారీ యూనియన్‌కు సైతం ఆరు ఎకరాలను కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అసోసియేషన్‌ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఎంపిపి వెంకటరామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బత్తుల చిన్నప్ప యాదవ్‌, మాజీ చైర్మన్‌ గంధం బాలిరెడ్డి, కౌన్సిలర్‌ గంట కాలేషా, ఏజీపీ ఎంఎం ప్రసాద్‌, ప్రగతి మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ గంటా సుభాని సెక్రెటరీ కాజా, ట్రెజరర్‌ షరీఫ్‌ జాయింట్‌ సెక్రెటరీ బాజీ పాల్గొన్నారు.

➡️