‘విప్రో’ ఉద్యోగాలకు ప్రకాశం విద్యార్థులు ఎంపిక

Dec 14,2023 19:40
ఉద్యోగాలకి ఎంపికైన ప్రకాశం విద్యార్థులు

ఉద్యోగాలకి ఎంపికైన ప్రకాశం విద్యార్థులు
‘విప్రో’ ఉద్యోగాలకు ప్రకాశం విద్యార్థులు ఎంపిక
ప్రజాశక్తి-కందుకూరు :ప్రకాశం ఇంజనీరింగ్‌ విద్యార్థులు మరోసారి సాంకేతిక నైపుణ్యంలో సత్తా చాటారని టెక్నికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కే.విజయ శ్రీనివాస్‌ (పూర్వ హెచ్‌సియల్‌ టెక్నికల్‌ మేనేజర్‌) హర్షం వ్యక్తం చేశారు. గూగుల్‌ ప్రాజెక్టుకు హైదరాబాద్‌ క్యాంపస్‌ లో పనిచేస్తారని ఆయన చెప్పారు. విప్రో కంపెనీ మంగళ,బుధవారం రెండు రోజులు పాటు నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఫైనలియర్‌ విద్యార్థులు 200 మంది పాల్గొనగా వివిధ దశలలో ఫిల్టర్‌ చేసి 69 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసారని విజరు వెల్లడించారు. ఎం.ఎన్‌.సి విప్రో రోల్స్‌ లో ఉద్యోగులు ఉంటారని, ప్రాజెక్ట్‌ మాత్రం గూగుల్‌ కంపెనీ ఆవరణంలో పని చేయవలసి ఉంటుందని ఆయన వివరించారు. ప్రపంచమంతటా సాఫ్టవేర్‌ ఉద్యోగాల నియామకాలు సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రకాశం విద్యార్థుల సాంకేతిక నైపుణ్య సమర్థతతో పెద్ద సంఖ్యలో విప్రో- గూగుల్‌ కంపెనీకి ఎంపిక కావడం హర్షదాయకమని కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య పేర్కొన్నారు. ఒక చేత డిగ్రీ-మరో చేత ఉద్యోగ పత్రం నినాదాన్ని కార్యరూపం దాల్చడంలో టెక్నికల్‌ డైరెక్టరు విజరు శ్రీనివాస్‌ కషి శ్లాఘనీయమని ఆయన తెలిపారు. కాలేజీ అకడమిక్‌ ఇన్చార్జి ఎస్‌.యం.మీరావలి, ప్లేస్‌ మేంట్‌ ఆఫీసర్‌ బాలకష్ణ, ఆయా బ్రాంచిల ఇన్‌ చార్జీ లు ఎస్‌. మాధవరావు, కే.కోటయ్య, కే. మోహన్‌ రావులు పర్యవేక్షించారు.

➡️