‘విశ్వకర్మ’ను సద్వినియోగం చేసుకోవాలి

Feb 27,2024 20:57

  ప్రజాశక్తి-విజయనగరం :  ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని చేతి వృత్తిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్ప్రెన్యూర్‌షిప్‌ (ఎంఎస్‌ఎంఇ ) ఆధ్వర్యాన స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం సెమినార్‌ నిర్వహించారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ కేసలి అప్పారావు మాట్లాడుతూ చేతివృతులల అభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి పొంది తద్వారా వలసలను అరికట్టవచ్చన్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వలసబాట పడుతున్నారని ఇటువంటి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి కుటుంబం లబ్ది పొందాలని అన్నారు. జిల్లా పారిశ్రామిక అభివద్ధి సంస్థ జనరల్‌ మేనేజర్‌ పాపారావు మాట్లాడుతూ చేతివృత్తిదారులు నూతన ప్రయత్నాలను ప్రారంభించాలని, ఈ పథకం కేవలం చేతివత్తి దారుల కుటుంబాల ఆర్ధిక ఉన్నతికి ఉపయోగ పడేదిగా ప్రభుత్వం రూపొందించి జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంఎస్‌ఎంఇ డైరెక్టర్‌ పిఎం విశ్వకర్మ నోడల్‌ అధికారి అప్పికొండ శ్రీను మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారంతా ఈ పథకానికి అర్హులన్నారు. కార్యమ్రంలో జిల్లా స్కిల్‌ డెవెలప్మెంట్‌ అధికారి ఆర్‌. గోవిందరావు, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ జిల్లా హెడ్‌ సిహెచ్‌ కోటేశ్వరరావు, ఎన్‌జిఒ ప్రతినధులు నీడ్‌ సంస్థ డైరెక్టర్‌ పి. వేణుగోపాల రావు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️