వెటర్నరీ ఫెడరేషన్‌ ఛైర్మన్‌గా రమేష్‌బాబు

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: పశు సంవర్ధక శాఖ ఆవరణలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్‌ నాన్‌-గ్రాడ్యుయేట్‌ వెటర్నరీ ఫెడరేషన్‌ మూడు సంఘాల అనుబంధం (విఏఎల్‌ఎస్‌ఏ, జెవిఒ, ఎఎల్‌ఓ) ఎన్నికలలో ప్రకాశం జిల్లా ఛైర్మన్‌గా తన్నీరు వి. రమేష్‌ బాబు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్‌ నాన్‌- గ్రాడ్యుయేట్‌ వెటర్నరీ ఫెడ రేషన్‌-అమరావతి చైర్మన్‌ సేవా నాయక్‌, సెక్రటరీ జి.రామకష్ణ ఆధ్వర్యంలో మూడు సంఘాల రాష్ట్ర ఎన్నికల అధికారులు జి. రామకష్ణ, బి.గోవిందరాజు, యన్‌. రాఘవ రావు సమక్షంలో నిర్వహించారు. మూడు సం ఘాల సభ్యులు మొత్తం 170 మంది ఈ ఎన్నికలలో పాల్గొన్నారు.

➡️