వేగ నియంత్రణతో ప్రమాదాల నివారణ

స్పీడ్‌ గన్‌తో వాహన వేగంపై నిఘా

ప్రజాశక్తి- వేపగుంట : ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ, వేగ నియంత్రణతో వాహనాలను నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని పెందుర్తి ట్రాఫిక్‌ సిఐ అశోక్‌ అన్నారు. బుధవారం గోపాలపట్నం, పెందుర్తి బిఆర్‌టిఎస్‌ రోడ్డులో స్పీడ్‌గన్‌లను ఏర్పాటు చేసి వాహన వేగాలపై నిఘాపెట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, బిఆర్‌టిఎస్‌ రోడ్డులో మధ్య మార్గంలో ఆర్‌టిసి బస్సులు, అంబులెన్స్‌లు, విఐపిల వాహనాలు మినహా ఇతర వాహనాల ప్రయాణం నిషిద్దమని, అతిక్రమిస్తే రూ.రెండు వేల వరకు జరిమానా తప్పదన్నారు. అలాగే బిఆర్‌టిఎ్‌ రోడ్డులో 40కిలోమీటర్లుకు మించి బైక్‌లను నడిపితే రూ.400 జరిమానా తప్పదన్నారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ధారణ, ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి అని సూచించారు. పెందుర్తి, గోపాలపట్నం బిఆర్‌టిఎస్‌ రోడ్డులో యాక్సిడెంట్ల జోన్‌ల వద్ద స్టాపర్ల ఏర్పాటుతోపాటు వాహనాల వేగంపై స్పీడ్‌గన్‌లతో నిఘా పెట్టి, అతిక్రమించిన వారిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్పీడ్‌ గన్‌తో వాహన వేగంపై నిఘా పెట్టిన పోలీసులు

➡️