వేరే ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలి

ఎన్నికల సెక్టోరియల్‌ అధికారులు

ఎన్నికల సెక్టోరియల్‌ అధికారులుగా వేరే ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌

ప్రజాశక్తి-విఆర్‌.పురం : రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్‌ అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం విలేకర్లతో మాఆ్లడుతూ, ఎన్నిక ప్రక్రియ ప్రారంభం నుంచి, ఫలితాల వెల్లడితో ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో సెక్టోరియల్‌ అధికారి పాత్ర చాలా ప్రధానమైనదని, ఆ స్థానంలో బాధ్యతాయుతమైన పర్మినెంట్‌ ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌, వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం వంటి విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను సెక్టోరియల్‌ అధికారులుగా నియమించారని, వెంటనే వారిని ఆయా బాధ్యతలను నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని కిరణ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించే వెలుగు, ఉపాధిహామీ పథకం, సచివాలయాలు వంటి కార్యాలయాల్లో మూడేళ్లకు మించి దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఇటువంటి ఉద్యోగులు ఓటింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. సంస్థలైన వైయస్సార్‌ క్రాంతి పదం మరియు ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్‌ సంస్థలో దీర్ఘకాలికంగా ఒకే చోట గత మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఉద్యోగులను, చింతూరు, వర రామచంద్రపురం కూనవరం, ఎటపాక మండలాలతోపాటు రంపచోడవరం ఏజెన్సీలోని ఏడు మండలాల్లోనూ కొందరు ఇలాంటి ఉద్యోగస్తులు వారు నియామకం జరిగిన నాటి నుంచి, నేటివరకు ఒకేచోట ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే ఆయా విభాగాల్లో స్థానికులైన ఉద్యోగులందరినీ తక్షణమే బదిలీ చేయాలని కోరారు. లామంది ఉద్యోగస్తులు మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేస్తున్నారని, అలాగే కొందరు ఉద్యోగులు మహిళా ప్రజా ప్రతినిధులకు భర్తలుగా ఉన్నారని, వీరంతా ఎన్నికలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షకంగా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నందున వీరందరినీ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించడంతోపాటు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌

➡️