వైఎస్‌ఆర్‌ పింఛన్లు రూ.3 వేలకు పెంపు

Dec 31,2023 21:54
సామాజిక భద్రత

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

సామాజిక భద్రత కింద అంద చేస్తున్న వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కానుక జనవరి ఒకటి నుంచి రూ.3 వేలకు ప్రభుత్వం పెంపుదల చేసిందని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీ లత ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఫింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతి నిధుల సమక్షంలో జనవరి 1 నుంచి 6 వరకూ నిర్వహిస్తామని చెప్పారు. జనవరి 1న నిడదవోలు అర్బన్‌, 2న నిడదవోలు రూరల్‌, తాళ్లపూడి, గోకవరం, దేవరపల్లి మండలాల్లో నూ, 3న అనపర్తి, కడియం, సీతానగరం, 4న పెరవలి, బిక్కవోలు, చాగల్లు, కొవ్వూరు రూర ల్‌, కొవ్వూరు అర్బన్‌, రాజమహేంద్రవరం రూరల్‌, రాజమహేంద్రవరం అర్బన్‌, రాజా నగరం, 5న గోపాలపురం, రంగంపేట, 6న కోరుకొండ, నల్లజర్ల, ఉండ్రాజవరం ఈ కార్య క్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 18 రకాల పె న్షన్లు 2,44,840 ఉన్నాయని, వీటి నిమిత్తం ప్రస్తుతం రూ.67,57,19,750 పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రూ.3 వేలు చొప్పున రూ.72, 66,42,000లను లబ్ధిదారులకు అందిం చనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లతోపాటు, కొత్తగా మరో 1,000 పింఛన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. వీటితో మొత్తం పింఛన్‌దారుల సంఖ్య 2.54 లక్షలకు చేరిందన్నారు.

➡️