వైద్యశిబిరానికి విశేషస్పందన

Mar 22,2024 21:06

 ప్రజాశక్తి – గరుగుబిల్లి  : మండలంలోని రావుపల్లిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి విశేస్పందన లభించింది. వివిధ విభాగాలకు చెందిన 23 మంది వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించారు. రావుపల్లిలో శ్రీసీతారామ మందిర పున: ప్రతిష్ట మహౌత్సవాలు ప్రాంభమైన నేపథ్యంలో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ గుల్ల సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ తమ స్వగ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఈ వైద్య శిబిరమును రావుపల్లితో పాటు గరుగుబిల్లి ,కొత్తూరు , కొత్తపల్లి, శివ్వాము ,తదితర గ్రామాలకు చెందిన సుమారు 2వేలమందికి తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులను అందజేశారు. వైద్యశిబిరానికి ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారికి మజ్జిగ ప్యాకెట్లు, పులిహౌర ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈవైద్య శిబిరం విజయవంతానికి సహకరించిన సూర్య ప్రకాష్‌, రామ్‌ నరేష్‌ను, ఇతర వైద్యులను రావుపల్లి గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అభినం దించారు.

➡️