వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

Nov 27,2023 19:30
వలేటివారిపాలెం శివాలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు

వలేటివారిపాలెం శివాలయంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులు
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
ప్రజాశక్తి – వలేటివారిపాలెం మండలంలోని పోకూరు, రోల్లపాడు, వలేటివారిపాలెం కలవల్ల కొండ సముద్రం తదితరు గ్రామాలలో సోమవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలతో శివాలయాలు కిటకటలాడాయి మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివాలయాలకు వెళ్లి దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఉపవాసాలు ఉండి మొక్కులు తీర్చుకున్నారు. వలేటివారిపాలెం రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలోని భ్రమరాంబికా దేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివలింగం తదితర దేవతామూర్తులను రకరకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం భక్తులు అన్నదానం నిర్వహించారు.

➡️