వైయస్సార్‌ పెన్షన్‌ కానుక అందజేత

Jan 4,2024 15:02 #ntr district

ప్రజాశక్తి-విస్సన్నపేట : విస్సన్నపేట మండలంలోని స్థానిక పుట్రేల రోడ్‌ మార్కెట్‌ యార్డ్‌లో వైయస్సార్‌ పెన్షన్‌ కానుకను ఎంపీడీవో ఎస్‌ వెంకటరమణ, జడ్పిటిసి సభ్యులు భీమిరెడ్డి లోకేశ్వర్‌ రెడ్డి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను వారు 2750/-నుండి 3 వేలుకు పెంచడం జరిగిందనీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి డైరెక్టర్‌ భూక్యరాణి, ఎంపీపీ పిల్లి మెర్సీ వనజాక్షి, జేఏసీ చైర్మన్‌ అనుమోలు శివ బాజీ మండల గ్రామ పంచాయతీ సర్పంచులు,ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️