‘వైసిపి’కి రోజులు దగ్గర పడ్డాయి : ఉగ్ర

ప్రజాశక్తి- పామూరు : రాష్ట్రంలోని వైసిపి సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహ రెడ్డి విమర్శించారు. స్థానిక శేషమాల్‌ థియేటర్‌లో టిడిపి కార్యకర్తలతో సమావేశం పువ్వాడి వెంకటేశులు అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి కార్యకర్తలు సైనికుల పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచి డివి. మనోహర్‌, బొల్లా నరసింహారావు, షేక్‌ రహంతుల్లా, తడికమల్ల సుబ్బారావు, గౌస్‌ బాషా, సాంబయ్య, రామారావు పాల్గొన్నారు.

➡️