వైసిపిని ఇంటికి సాగనంపాలి : ముత్తుముల

ప్రజాశక్తి-కొమరోలు రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి బెల్లంకొండ సాయిబాబు కోరారు. టిడిపి, జనసేన ఆధ్వర్యంలో కొమరోలు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ రెడ్డి, సాయిబాబా ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. నిత్యావసరాలు, కరెంట్‌ బిల్లులు, ఇంటి పన్నులు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అశోక్‌రెడ్డి మాట్లాడుతూ బస్‌ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెరగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నట్లు తెలతిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి ధరలను నియంత్రిస్తామన్నారు. ప్రజలకు సంక్షేమ పాలన టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. జనసేన గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి బెల్లంకొండ సాయి బాబా మాట్లాడుతూ జనసేన,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, టిడిపి జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️