వైసిపిని ఎదుర్కొనే సత్తా టిడిపి, జనసేనకు లేదు- ఎమ్మెల్యే

పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రజాశక్తి-బి.కొత్తకోట రాష్ట్రంలో త్వరలో జరుగబోవు శాసనసభ ఎన్నికల్లో వైసిపిని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఎదుర్కొనే సత్తా టిడిపి-జనసేన కూటమికి లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఖాజాఖాన్‌ మొదటి వీధిలో నూతన గహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు, కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేకనే చంద్రబాబు నాయుడు పవన్‌ కల్యాణ్‌తో జత కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఎంతమంది కూటమిగా వచ్చిన వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఫ్యాన్‌ ప్రభంజనంలో తుడిచిపెట్టుకుపోతారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా జగనన్న గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్‌ అహ్మద్‌, వైసిపి పట్టణ అధ్యక్షుడు సిఆర్‌ చిన్నికష్ణ, జెఎసి మండల కన్వీనర్‌ రెడ్డిహరి, జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్‌ బాషా, సచివాలయ కన్వీనర్లు జివి రామకష్ణ, జి.చాంద్‌ బాషా, జగనిజం నరసింహనాయుడు, అభిలాష్‌ రెడ్డి, సద్దాం, ఎంవి కష్ణయ్య, ఎంపిటిసి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

➡️